హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పంచాయతీ ఎన్నికల్లో రసాభాస

అన్నమయ్య: నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, కూటమి నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో గందరగోళం నెలకొనగా, రాజంపేట డీఎస్పీ బి. వెంకటరామయ్య జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.