హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

106 ఏళ్ల వయసులో ఓటు వేసిన వృద్ధుడు

ATP: బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లికి చెందిన బండయ్య స్వామి 106 ఏళ్ల వయసులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా గురువారం పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఉత్సాహంగా ఓటు వేశారు. యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పలువురు అభినందించారు. ఎన్నికల్లో ఓటు విలువను చాటిన బండయ్య స్వామి అందరి దృష్టిని ఆకర్షించారు.