నంద్యాల కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవిస్తూ.. పౌరులు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ హక్కులు, విధులను గౌరవించాలి: కలెక్టర్


