హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి'

ASR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ నిశాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతలను గుర్తించాలని సూచించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరించాలని కోరారు. అధికారులు పారదర్శకంగా సేవలందిస్తూ, గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని ఆదేశించారు.