హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను సందర్శించిన కలెక్టర్

VKB: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గురువారం వికారాబాద్ మండలం గొట్టుముక్కల గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను పరిశీలించి, రామ్ పథకం అమలు తీరును తెలుసుకున్నారు. పాఠశాల పరిస్థితులను పరిశీలించడంతో పాటు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.