BHPL: కొత్తపల్లి గోరి మండలం నిజాంపల్లి గ్రామంలో ఈనెల 27 నుంచి డిసెంబర్ 3 వరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నిర్వహించనున్నట్లు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, గ్రామ సర్పంచ్ నండ్రే సునీత-రవీందర్ తెలిపారు. అర్హులు ఆధార్, రేషన్ కార్డు, నామినీ ఆధార్, మొబైల్ నంబర్‌తో ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకోవాలని కోరారు.
తెలంగాణ
'రేపటి నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం'


