హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ విగ్రహానికి నివాళులు

PDPL: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొయ్యడ సతీశ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, మల్లారపు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.