హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి MLC ఆర్థిక సాయం

WGL: నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు ఉన్నారు.