W.G: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొల్లేరు తీరప్రాంతాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దాపురం, చిన్నమిల్లిపాడు, కాలింగ గూడెం, రాజుపేట తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసం అవ్వడం, గోతులుమయంగా మారడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అధ్వానంగా కొల్లేరు రహదారులు


