హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు పంచాయతీల్లో బంధువులే సర్పంచులు

KDP: బంధువులే నాలుగు పంచాయతీల్లో సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఘటన కడప జిల్లా వీఎన్ పల్లె మండలంలో జరిగింది. ఎస్.పాలగిరిలో గెలిచిన గోపాల్, వెంకటాపురంలో గెలిచిన ప్రతాప్ వరుసకు సోదరులు. గోనుమాకులపల్లె సర్పంచ్ రమణమ్మ, బసిరెడ్డి పల్లె సర్పంచ్ వెంకట వాసు కలిపి ప్రతాప్‌కు బంధువులు. దీనితో బంధువులే నాలుగు పంచాయతీలకు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.