హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య పనులపై మున్సిపల్ ఛైర్మన్ ప్రత్యేక పర్యవేక్షణ

SS: ధర్మవరం పట్టణంలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ ఛైర్మన్ పరిసే సుధాకర్ పరిశీలించారు. మస్టర్ నంబర్-02 శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ సాంసన్‌తో కలిసి కార్మికుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. పట్టణంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా వాహనాలు ప్రతిరోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.