చిత్తూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 9 మండలాల పరిధిలోని 177 పంచాయతీల్లో 36.54% పోలింగ్ నమోదైంది. మొత్తం 4,11,159 మంది ఓటర్లకు గాను 1,50,255 మంది ఓటు వేశారు. పెద్దపంజాణిలో అత్యధికంగా 41.34%, బైరెడ్డిపల్లిలో 40.78% పోలింగ్ నమోదైంది. రామకుప్పంలో అత్యల్పంగా 33.85% నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఉ. 9గంటలకు పోలింగ్ ఎంతంటే?


