హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడుపల్లి మండలంలో 36.3 శాతం పోలింగ్

CTR: గుడుపల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉదయం 9 గంటల వరకు 36.3 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 35,539 మంది ఓటర్లకు గాను 12,904 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కంచిబందార్లపల్లి అత్యధికంగా 51 శాతం, కొడతనపల్లి 48 శాతం పోలింగ్ నమోదు కాగా, బెగ్గిలపల్లిలో అత్యల్పంగా 24.5 శాతం నమోదైంది. మొత్తంగా పురుషులు 6,548 మంది, మహిళలు 6,356 మంది ఓటు వేశారు.