హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన 102 ఏళ్ల బామ్మ

KDP: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పే అరుదైన దృశ్యం బద్వేల్ మండలంలో ఆవిష్కృతమైంది. చింతలచెరువు గ్రామానికి చెందిన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వృద్ధురాలి పరిస్థితిని గమనించిన బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ ఆమెను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేసేందుకు సహకరించారు.సీఐని పలువురు అభినందించారు.