నంద్యాల మండలంలోని అయ్యలూరులో ఇప్పటివరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గ్రామంలో 5,715 ఓట్లు ఉండగా 11 సమయానికి 3,662 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 14 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అయ్యలూరులో 64 శాతం పోలింగ్


