హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సార్వత్రిక విద్యాపీఠంలో అడ్మిషన్లు ప్రారంభం

CTR: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు నగరి ఎంఈవో నమశ్శివాయం తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సార్వత్రిక విద్యాపీఠం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చదువుకు మధ్యలో దూరమైన వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.