హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గందరగోళం.. నిలిచిన ఎన్నికలు!

నెల్లూరు: బోగోలు మండలం అల్లిమడుగు పంచాయతీ పరిధిలోని తెల్లగుంట ఓటర్ల జాబితాలో గందరగోళం ఏర్పడింది. 183వ పోలింగ్ కేంద్రంలో 606 మంది ఓటర్లు ఉండగా అధికారుల ఓటర్ల గ్రూపులోని సీరియల్ నెంబర్లకు, అధికారిక జాబితాలోని నెంబర్లకు వ్యత్యాసం రావడంతో పోలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి పునః ప్రారంభించాలని ఓటర్లు కోరుతున్నారు.