బాపట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2వ వార్డు నందిరాజ్ తోట, 9వ వార్డు మరుప్రోలువారిపాలెంలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ షేక్ షలీమా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్


