హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రన్నింగ్ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్!

TPT: చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం మణికంఠ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో 34 మంది ఉన్నారు. ఫైర్ అలారం మోగడంతో డ్రైవర్ బస్సును ఆపి అందరినీ దించేశాడు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రాణనష్టం లేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.