హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఆదిలాబాద్ పట్టణంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాల సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయానికి మూలాదారమని పేర్కొన్నారు.