హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న రేలంగి శ్రీదేవి

తూ.గో: రాజమండ్రి నగర కార్పొరేషన్ మేయర్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేలంగి శ్రీదేవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు ఒకే విలువ ఉంటుందని ఆమె మాట్లాడారు. కుల, మత, వర్గ, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా భావించి అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.