KDP: సిద్ధవటం మండలంలోని భాకరాపేట గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌ను SP నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును, పోలీసుల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ


