హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా నాచుగుంట వంతెన

ELR: నాచుగుంట వద్ద ఏలూరు ప్రధాన కాలువపై వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనపై వర్షం నీరు నిలిచి బురదమయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రైలింగ్ విరిగి ఉండటంతో అదుపు తప్పితే నేరుగా కాలువలో పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.