హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పది రోజులైనా తొలగించని చెట్ల కొమ్మలు

KRNL: ఆదోనిలోని గర్ల్స్ హైస్కూల్ మార్గంలో ఎస్కేడీ కాలనీ రోడ్డు డివైడర్ల మధ్య నరికిన చెట్లను పది రోజులుగా తొలగించకుండా వదిలేశారు. చెట్ల కొమ్మలు రోడ్డుపై ఉండటంతో వాహనదారులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరారు.