PPM: పాలకొండలోని తమ్మినాయుడు డిగ్రీ కళాశాలలో నవంబర్ 28న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని 685 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్నవారు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
పాలకొండలో ఈ నెల 28న జాబ్మేళా


