ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో మొత్తం 110.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 4.0 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొయ్యలగూడెంలో అత్యధికంగా 54.6 మి.మీ. వర్షం కురిసింది. పెదవేగిలో 11.6, లింగపాలెంలో 10.4, ఏలూరు పట్టణంలో 7.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో చినుకు కూడా పడలేదని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 24 గంటల్లో 110.6 మి.మీ. వర్షం


