కాకినాడ: కోటనందూరు బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి (40) మృతదేహం లభ్యమైంది. అచేతన స్థితిలో ఉన్న వ్యక్తిని గుర్తించి పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నీలం రంగు షర్టు, లుంగీ, నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 9440900773 నంబర్‌తో కోటనందూరు పోలీసులను సంప్రదించాలని SI రామకృష్ణ కోరారు.
ఆంధ్రప్రదేశ్
కోటనందూరు బస్టాండ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం


