హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిగ్గింగ్ ఆరోపణలు.. తిమ్మారెడ్డిపల్లెలో నిలిచిన పోలింగ్

కడప: పోరుమామిళ్ల మండలం తిమ్మారెడ్డిపల్లెలో పోలింగ్ నిలిచిపోయింది. రెండో వార్డులో దాదాపు 250 ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తూ పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని.. తమకు న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే రెండో వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.