హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం మండలంలో 36.04% పోలింగ్

CTR: కుప్పం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి మండల వ్యాప్తంగా 36.04 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 55,332 మంది ఓటర్లకు గాను 19,944 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 10,412 మంది పురుషులు, 9,532 మంది మహిళలు ఓటు వేశారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు.