హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి.కొత్తకోటలో 9 గంటలకు 12.79 శాతం పోలింగ్

అన్నమయ్య: బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 12.79 శాతం పోలింగ్ నమోదైంది. 23,368 మంది ఓటర్లకు 2,988 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,651 మంది పురుషులు, 1,337 మంది మహిళలు ఓటు వేశారు. మొత్తం 23 వార్డుల్లోని 28 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.