హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోండి: సీఐ సుభాష్

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పోలింగ్ కేంద్రాలను సీఐ ఎం.వి. సుభాష్ పరిశీలించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించారు. ఓటర్లు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.