హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

W.G: భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులో ఉన్న పద్మావతీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను ఇవాళ్టి నుంచి ఈనెల 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయాధికారి M.సత్యనారాయణరాజు తెలిపారు. ఉదయం విష్వక్సేన పూజ, యాగశాల ప్రవేశం, హోమం, 27న సప్తకలశారాధన, అభిషుకాలు, సాయంత్రం ప్రధాన హోమం, పవిత్రారోహణ, 28న ఉదయం పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.