హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

12 పంచాయతీలు ఏకగ్రీవం: ఎంపీడీవో

NDL: సంజామల మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గానూ 12 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు గురువారం ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. అక్కంపల్లె, ఆర్.లింగందిన్నె, పేరుసోముల, రామిరెడ్డిపల్లె, రెడ్డిపల్లె, ఆల్వకొండ, ముక్కమళ్ల, వసంతాపురం, కమలపురి, ముదిగేడు, ఎగ్గోని, సంజామల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఐదు పంచాయతీలకు ఈనెల 29న ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.