హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబంలో ఇద్దరికి రాజకీయ పదవులు

కడప జిల్లా వీఎన్‌పల్లె మండలం అడవిచెర్లోపల్లెలో ఒకే కుటుంబానికి రెండు పదవులు దక్కాయి. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఓబయ్య యాదవ్ కుమార్తె చంద్రిక ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి నాగన్న సైతం పోటీ లేకుండా సర్పంచిగా ఎన్నికయ్యారు. దీంతో గ్రామంలో ఒకే కుటుంబానికి రెండు పదవులు దక్కడం చర్చనీయాంశంగా మారింది.