నెల్లూరు: వింజమూరులో గురువారం పోలింగ్ జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎన్నికల సిబ్బంది చీకట్లోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో ఓటర్ స్లిప్పులను పరిశీలిస్తూ సిబ్బంది పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సెల్ ఫోన్ వెలుగులో పోలింగ్.!


