KRNL: ఆదోని నియోజకవర్గంలోని నాగనాతనహళ్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటర్లను వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నాగనాతనహళ్లిలో స్వల్ప ఉద్రిక్తత


