హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టౌన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన 1వ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన మాతృమూర్తి శాంతమ్మతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ ఎన్నికలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.