హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న మేయర్ అభ్యర్థి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానేటి రాధారాణి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని 51వ డివిజన్ బొందిలిపురంలో కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు