ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని అయ్యలూరివారిపల్లెలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ, వైసీపీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లకు తాయిలాలు ప్రకటించడంతో పాటు, ఒక్కో ఓటుకు రూ.25 వేల చొప్పున పంపిణీ చేసినట్లు గ్రామంలో సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే ఈ నగదు పంపిణీపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చంద్రశేఖరపురంలో ఒక్క ఓటుకు రూ. 25 వేలు


