హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రంలో సౌకర్యాల కొరత

VZM: కొత్తవలస డాబాలు ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టేబుల్స్ వంటి కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమాచారం, టేబుల్స్ లేక వృద్ధులు, మహిళలు తికమకపడుతూ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఓటు వేయకుండానే వెనుతిరుగుతుండటంతో, ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఓటర్లు కోరుతున్నారు.