హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొండలో కొండచిలువ హల్‌చల్!

PPM: పాలకొండ మండలంలోని కొండాపురం గ్రామంలో భారీ కొండచిలువ బుధవారం హల్‌చల్ చేసింది. రైతులు పొలంలో వరి చేను కోస్తున్న సమయంలో అది ఒక్కసారిగా బయటకు రావడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు కలిసి ఆ కొండచిలువను హతమార్చారు.