హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పంలో 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

CTR: కుప్పం నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ హేమంత్ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు.