హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 స్థానాల్లో ద్విముఖ పోరు

AKP: పాయకరావుపేట మండలంలో పంచాయతీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. 21 పంచాయతీల్లో మూడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 18 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 13 పంచాయతీల్లో ద్విముఖ, ఐదు చోట్ల త్రిముఖ మరో మూడు పంచాయతీల్లో చతుర్ముఖ పోటీ జరుగుతుంది. సర్పంచ్ స్థానాలకు మొత్తం 53 మంది, 209 వార్డులకు 465 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.