తూ.గో: గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న బైకు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గోకవరం మండలం గుమ్మలదొడ్డి ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సత్యం, ప్రసాద్ పెట్రోల్ బంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. గోకవరం నుంచి కోరుకొండ వైపు గంజాయితో అతివేగంగా వెళ్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి తరలిస్తున్న బైకు ఢీ.. ఒకరి మృతి!


