హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 177 పంచాయతీలకు ఎన్నికలు

కోనసీమ: అమలాపురం డివిజన్ పరిధిలోని 177 గ్రామ పంచాయతీలు, 2,016 వార్డులకు ఇవాళ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక్కడ 2,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌లో పురుష ఓటర్లు 2,81,995, మహిళా ఓటర్లు 2,84,489, ఇతరులు 3, మొత్తంగా 5,66,487 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో 41 అత్యంత సమస్యాత్మకమైనవిగా, 58 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఉన్నాయని తెలిపారు.