హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెహ్రు నగర్ తండాలో అర్ధరాత్రి పోలీసుల అరెస్టులు?

పల్నాడు: బొల్లాపల్లి మండలం నెహ్రునగర్ తండాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు హడావుడి సృష్టించారు. బైండోవర్ కేసుల పేరుతో సర్పంచ్ అభ్యర్థితో పాటు పలువురు వార్డు సభ్యులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ పోలీసుల చర్యలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.