VSP: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం మండలాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. పరవాడలో 15 సర్పంచి స్థానాలు, 154 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సబ్బవరం మండలంలో 24 పంచాయతీలు ఉండగా అంతకాపల్లి, బంగారమ్మపాలెం, టెక్కలిపాలెం, బాటజంగాలపాలెం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20 పంచాయతీలు, 172 వార్డులకు ఎన్నిక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు రెండు మండలాలలో ఎన్నికలు


