అన్నమయ్య: బి.కొత్తకోట మండలం గుట్ట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బి. మౌలా(45) బుధవారం టీ తాగేందుకు రోడ్డుపైకి వచ్చాడు. టీ తాగి ఇంటికి వెళ్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మౌలా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో గట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో వ్యక్తి మృతి


