ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా హింస నిరోధక దినోత్సవం సందర్భంగా బుధవారం సదస్సు నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం కన్వీనర్ డాక్టర్ కే.గౌతమి సమాజంలో మహిళల ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ వ్యవస్థలో వారి పాత్ర, ఓర్పు, సహనం, మహిళల సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కళాశాలలో మహిళా హింస నిరోధక దినోత్సవం


