హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లులో 27న బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు

ATP: గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఈ నెల 27న ఆర్డీటీ గుంతకల్లు క్లబ్ ఆధ్వర్యంలో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-12 విభాగంలో లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, పరుగుపందెం పోటీలు ఉంటాయని క్లబ్ ఇన్‌ఛార్జి కిరణ్‌కుమార్ తెలిపారు. చుట్టుపక్కల మండలాల పిల్లలు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9533858205 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.